వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ వివాదాలను కొని తెస్తోంది. ఈ సినిమాలోని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కించపరిచేలా వుందని ఆ పార్టీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి వర్మ కౌంటరిచ్చారు.
మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రమే తన క్లయింట్‌పై పరువునష్టం కేసును దాఖలు చేయగలరని, పక్కనవాళ్లు చేయలేరని వర్మ తెలిపాడు. ఎస్వీ మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారని.. ఇది కూడా చట్ట ప్రకారం నేరమన్నాడు. వర్మ న్యాయవాది ప్రభాకర్ ద్వారా వర్మ పంపిన లీగల్ నోటీసులో మోహన్ రెడ్డి ఫిర్యాదుతో తన క్లయింట్ పరువుకు భంగం కలిగిందన్నారు. ఈ విషయంలో నోటీస్ అందుకున్న 48 గంటల్లోగా మోహన్ రెడ్డి తాను పెట్టిన పోలీస్ కేసును విత్ డ్రా చేసుకోవడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.