మదర్స్ డే సందర్భంగా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా నుంచి వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియో గ్లింప్స్ లో అమ్మ గురించి సుహాసిని, సొహైల్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 9 నెలల కష్టాన్ని నవ్వుతూ భరించి, ప్రాణాలకు తెగించి ఓ బిడ్డకు జన్మనిస్తారు. ఈ ఆడవాళ్లు గ్రేట్ సార్ అంటూ సొహైల్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఉద్వేగంగా ఉంది.
నటీనటులు : సొహైల్ , రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం,
రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు
సాంకేతిక నిపుణులు : సినిమాటోగ్రఫీ - నిజార్ షఫీ, సంగీతం - శ్రావణ్ , ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ - గాంధీ నడికుడికర్, బ్యానర్ - మైక్ మూవీస్, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాతలు - అప్పి రెడ్డి, రవిరెడ్డి సజ్జల, రచన-దర్శకత్వం - శ్రీనివాస్ వింజనంపాటి