సమంతతో సరదాగా సాగిపోయింది.. సావిత్రి రోల్ ఇస్తే?: విజయ్ దేవరకొండ

బుధవారం, 9 మే 2018 (11:34 IST)
మహానటి సినిమాలో జెమినీ గణేశన్ పాత్ర కోసం దుల్కర్ సల్మాన్‌ను సంప్రదిస్తే.. డేట్స్ కుదరక ఒప్పుకోలేదని.. దీంతో తనను ఆ పాత్ర పోషించాల్సిందిగా నాగ్ అశ్విన్ కోరాడని.. హీరో విజయ్ దేవరకొండ చెప్పాడు. జెమినీ పాత్రను తాను పోషించగలనా అనే భయం ఉండేదని... కానీ, మళ్లీ దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, తాను తప్పించుకున్నానని విజయ్ దేవరకొండ అన్నాడు. 
 
చివరకు విజయ్ ఆంటోని పాత్రలో సెటిల్ అయ్యానని చెప్పాడు. తమిళ, తెలుగు సినిమాలు చాలావరకు దగ్గరగా ఉంటాయని... దీంతో, తమిళంలో నటించినా వర్కవుట్ అవుతుందని విజయ్ దేవరకొండ తెలిపాడు. ఇక సమంత ఎప్పుడూ షూటింగ్‌లో హుషారుగా వుంటుందని.. జోక్స్ వేసూ నవ్విస్తుంటుందని తెలిపారు. 
 
'మహానటి' గురించి స్వప్న ఫోన్ చేసి చెప్పగానే... ఎలాంటి వివరాలు అడక్కుండానే ఒప్పేసుకున్నానని... స్వప్న, నాగ్ అశ్విన్ ఇద్దరూ తన ఫ్రెండ్స్ కావడమే ఇందుకు కారణమని అర్జున్ రెడ్డి చెప్పాడు.

కాగా అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్విని దత్‌ సినిమాను నిర్మించారు. కీర్తి సురేశ్‌ టైటిల్‌ రోల్‌లో నటించారు. సమంత ప్రధాన పాత్ర పోషించారు. బుధవారం (మే 9న) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
 
ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి సినిమాకు తర్వాత నిర్మాత అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్ ఫోన్ చేసి మహానటి గురించి చెప్పారు.

తాను ఆమెను అక్క అని పిలుస్తుంటానని.. ఆమెను సావిత్రి రోల్ తనకివ్వమని అడిగానని తెలిపాడు. దీంతో ఆమె గట్టిగా నవ్వి.. ''షటప్''‌ అంది. ఈ సినిమాలో నువ్వు చిన్న పాత్ర‌ చేయాలని అడిగిందని.. అలనాటి తార సావిత్రి చిత్రంలో నటించే అవకాశం తిరిగి రాదనే ఉద్దేశంతో ఈ చిత్రంలో నటించానని తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు