నిజానికి విజయ్ దేవరకొండ ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లు మాత్రమే నటించారు. కానీ, "మళ్లీ మళ్లీ ఇది రోజు" ఫేం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో మాత్రం ఏకంగా నలుగురు హీరోయిన్లను బుక్ చేశారట.
ప్రస్తుతం విజయ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' అనే చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఆ తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. ఇందులో రాశీఖన్నా, ఐశ్వర్యరాజేష్, బ్రెజిల్ మోడల్ ఇసాబెల్లె డి, కేథరిన్ థెస్రాలను ఎంపిక చేశారు.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. వినూత్న ప్రేమ కథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర వైవిధ్యంగా ఉండనుండగా, ప్రేమలో అతని దృష్టికోణం విభిన్నంగా సాగుతుందని అంటున్నారు. నలుగురు హీరోయిన్లకి , హీరోకి మధ్య జరిగే సంఘటనలు ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని అందిస్తుందని చెబుతున్నారు.