సినిమాలకు గుడ్ బై చెప్తా.. విజయ్ దేవరకొండ

సోమవారం, 29 జులై 2019 (10:50 IST)
క్రేజీ హీరో, అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్‌ దేవరకొండ అప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడట. "నేను ఎప్పుడైనా నటనకు స్వస్తి చెప్పొచ్చు. నాకు సినిమాలకు మించి ఆసక్తికరంగా ఏదన్నా చేయాలనిపించినా, చేసిందే చేస్తున్నానిపించి బోర్‌ కొట్టినా వెంటనే యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేస్తాను" అన్నారు విజయ్ దేవరకొండ. ఆయన చిత్రం 'డియర్ కామ్రేడ్'. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. అలాగే పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించనని.. మరో ఐదేళ్లు ఆగాల్సిందేనని.. 35 ఏళ్లు వచ్చాక పెళ్లి గురించి ఆలోచిస్తానని విజయ్ దేవర కొండ చెప్పుకొచ్చాడు.  
 
కాగా డియర్‌ కామ్రేడ్ సినిమా విడుదలై డివైడ్‌ టాక్‌తో మొదలైంది. కానీ ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్‌ దేవరకొండ హీరో నటిస్తున్న తదుపరి చిత్రం ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది.
 
డియర్‌ కామ్రేడ్ తరువాత క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో పాటు తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో హీరో సినిమాల్లో నటిస్తున్నాడు. హీరో సినిమాకు సంబంధించి ఓ భారీ షెడ్యూల్‌ను ఢిల్లీలో చిత్రకరించారు. అయితే ఈ సన్నివేశాలపై చిత్ర నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు