Vijay devarakonda-Shnmuka
ఇండియన్ ఐడియల్ లో విశాఖపట్నంకు చెందిన షణ్ముఖ ప్రియతోపాటు పలువురు యువ గాయనీ గాయకులు పాల్గొన్నారు. ఇండియన్ ఐడియల్ గ్రేటెస్ ఫినాలో ఆమె పాటలకు వచ్చిన స్పందన చూసి విజయ్‌దేవరకొండ లైవ్‌లో ఆమెతో మాట్లాడారు. శనివారంనాడు తన ఫేస్‌బుక్ లైవ్‌లో ఆమెతో మాట్లాడుతూ,, షణ్ముక తల్లిదండ్రులనుద్దేశించి, మీరు పక్కనే వుంటూ ష్మణుక పాడుతుంటే లిప్‌సింక్ ఇస్తుంటే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. షణ్ముక, నీతోపాటు ఇందులో పాల్గొన్నవారందరికీ బెస్ట్ విషెస్ చెబుతున్నా. ముఖ్యంగా నీకు. గెలుపు, ఓటములు మర్చిపో. ఇదొక తీపి జ్ఞాపకం. అధైర్యపడవద్దు. నువ్వు హైదరాబాద్ రాగానే నన్ను కలుస్తున్నావ్. నా సినిమాలో పాడుతున్నావ్. గుడ్ లక్ అంటూ ధైర్యాన్ని నింపారు.