ఆగస్టు 11న కోబ్రా వచ్చేస్తోంది..

మంగళవారం, 9 ఆగస్టు 2022 (22:28 IST)
Cobra
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా.. ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'కోబ్రా'. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీనిధి శెట్టి (కేజీయఫ్ ఫేమ్) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో.. హీరో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు. 
 
ఆగస్ట్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఇంతకుముందు అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ తేదీకి ఈ చిత్రం విడుదల కావడం లేదు. తాజాగా.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.  
 
ఈ సినిమాలో ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటించగా.. మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు