వరలక్ష్మి-విశాల్‌లకు పెళ్లి జరుగబోతున్నట్లు వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా విశాల్ నిశ్చితార్థం జరుగనుంది. సినీ నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారట. హైదరాబాద్‌కు చెందిన అనీసా అనే ఓ వ్యాపారవేత్త కుమార్తెతో విశాల్ వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది.
కాబట్టి ప్రస్తుతానికి నిశ్చితార్థ పనులు మొదలుపెట్టే పనిలో ఆయన కుటుంబీకులు ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇకపోతే, వరలక్ష్మి ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. విశాల్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు.