కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ నటించిన తాజా చిత్రం "ఎఫ్ఐఆర్". శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనివున్నాయి. ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసిన "ఎఫ్ఐఆర్"కు మూడు అరబ్ దేశాలు తేరుకోలేని షాకిచ్చాయి.
కువైట్, మలేషియా, ఖతార్ దేశాలు ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా నిషేధం విధించాయి. ఈ విషయాన్ని విష్ణు విశాల్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. సినిమాలోని కంటెంట్ కారణంగా ఆయా దేశాల్లో విడుదల చేసేందుకు ఆ దేశాల సెన్సార్ బోర్డును అనుమతి నిరాకరించినట్టు సమాచారం.
కాగా, ఈ చిత్రంలో విష్ణు విశాల్, మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, గౌతం మీనన్ వాసుదేవ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఇందులో విష్ణు విశాల్ మోస్ట్ వాంటెడ్ యువకుడిగా నటించగా, గౌతం మీనన్ ప్రధానమంత్రినికి జాతీయ భద్రతా సలహాదారుడి పాత్రలో నటించారు.