హీరో వరుణ్ భార్య వితికా షేరూ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తోంది. సినిమాలకు దూరంగా ఉంటున్నా ఈ జంట ఆ మధ్య బిగ్‌బాస్‌లో కనిపించి అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఆమె అనారోగ్యం బారిన పడినట్లు వెల్లడించింది. తాను కొన్ని రోజులుగా స్పాండిలైటిస్, మైగ్రేన్‌తో బాధపడుతున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది.
మైగ్రేన్‌తో విపరీతమైన తలనొప్పి, వెన్నునొప్పి కలుగుతున్నాయని, ఫలితంగా ఏ పనీ చేయలేకపోతున్నానని పేర్కొంది. స్పాండిలైటిస్‌కు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నట్టు తెలిపింది. నీడ్లింగ్ కూడా చేయించుకున్నట్లు తెలిపింది.