68 వ జాతీయ సినిమా అవార్డులు నేడు ప్రకటించారు. దేశంలో వివిధ భాషల సినిమాలకు అందులోని వివిధ శాఖలకు చెందిన వారిని గుర్తించి ఉత్తమ కేటగిరి అవార్డులు అందజేశారు. ఇక తెలుగులో చూసుకుంటే సంగీత దర్శకుడు థమన్‌కు అలవైకుంఠపురంలో.. సినిమాకు రావడం చాలా ఆనందంగా వుందని నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, పదేళ్ళవరకు ఈ పాటలు ప్రేక్షకుల మదిలో వుండిపోతాయని అన్నారు. అది నిజమైందని థమన్ పేర్కొన్నారు. ఈ అవార్డు రావడంపట్ల అల్లు అరవింద్, అల్లు అర్జున్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వివిధ కేటగిరిలలో వచ్చిన అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
వివిధ శాఖలు, సినిమాల అవార్డుల వివరాలు
ఉత్తమ చిత్రం : సూరయైపొట్రు
ఉత్తమ నటుడు : సూర్య ,అజయ్ దేవగణ్
ఉత్తమ నటి : అపర్ణ బాలమురళి
ఉత్తమ దర్శకుడు : కె. ఆర్. సచ్చిదానందన్ (అయ్యప్పమ్ కోషియమ్)
ఉత్తమ సహాయనటుడు :
బిజుమీనన్ ( అయ్యప్పమ్ కోషియమ్ )
ఉత్తమ సహాయ నటి - లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివ రంజినీయుము ఇన్నుమ్ సిలా పెంగలుమ్)
ఉత్తమ బాల నటుడు - వరున్ బుద్దదేవ్(తులసీదాస్ జూనియర్)- స్పెషల్ మెన్షన్
ఉత్తమ నేపథ్యం సంగీతం - జీవీ ప్రకాష్ కుమార్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ - నచికేట్ బర్వే, మహేష్ షేర్లా(తానాజీ)
బెస్ట్ లిరిక్ - సైనా(మనోజ్ మౌతషిర్)
మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ - మధ్యప్రదేశ్
బెస్ట్ స్టంట్స్ - అయ్యప్పనుమ్ కోషియమ్
బెస్ట్ కొరియోగ్రఫీ - నాట్యం (తెలుగు)
ఉత్తమ డ్యాన్సర్: సంధ్య రాజు (నాట్యం- తెలుగు)
ఉత్తమ సంగీత దర్శకుడు - తమన్ (అల వైకుంఠపురములో)
నాన్ ఫియేచర్ ఫిలింస్
బెస్ట్ వాయిస్ ఓవర్: శోభా రాప్సోడీ ఆఫ్ రెయిన్స్- మాన్‌సూన్స్ ఆఫ్ కేరళ (ఇంగ్లీష్)