పవనిజం పుస్తకం మాత్రం వేస్టే - చిరంజీవి సినిమాలన్నీ చూశా: వర్మ

శుక్రవారం, 27 నవంబరు 2015 (12:35 IST)
తాను చిరంజీవి వీరాభిమానిని. అందుకే మెగాస్టార్ సినిమా అంటే రాజమౌళికి పది రెట్లు ఉండాలని కోరుకుంటున్నానని రామ్ గోపాల్ వర్మ అంటున్నారు. అంతేగాకుండా.. జనసేన ప్రారంభించినప్పుడు పవన్ ఇచ్చిన స్పీచ్ అదుర్స్ అంటున్నాడు. కానీ పవన్ కల్యాణ్ రాసిన పవనిజం పుస్తకం మాత్రం వేస్టే అని తేల్చేశాడు. ఒక మనిషిగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమంటున్న వర్మ.. పవర్ స్టార్‌గా మాత్రం ఆయన నచ్చలేదంట. 
 
అసలు పవన్ కళ్యాణ్ మూవీల్లో కొమరం పులి తప్ప మరే సినిమానీ చూడలేదట. అదే అన్నయ్య చిరంజీవి విషయానికొస్తే.. మెగాస్టార్‌గా చిరంజీవి అంటే చాలా ఇష్టమే అంటున్నాడు వర్మ. కానీ వ్యక్తిగా మాత్రం చిరు అంటే పడదంటున్నాడు. 
 
ఒక స్టార్‌గా చిరంజీవిపై ఎనలేని అభిమానం అని చెప్పడమే కాకుండా... ఆయన నటించిన మొత్తం 150  సినిమాలను బ్రూస్ లీతో సహా చూశానన్నాడు. చిరంజీవి సినిమాలను లైన్‌లో నిల్చుని టికెట్స్ కొన్నానని బ్లాక్‌లో టికెట్స్ కొనేందుకు ఎగబడ్డానని రామ్ గోపాల్ వర్మ తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి