హృతిక్ రోషన్-కంగనా రనౌత్‌ల ఇష్యూ: విద్యాబాలన్, ఫెర్నాండెజ్‌లు ఏం చెప్పారు?

శుక్రవారం, 6 మే 2016 (18:47 IST)
బాలీవుడ్ సెలెబ్రిటీస్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌ల వ్యవహారంపై డర్టీ పిక్చర్ భామ విద్యాబాలన్ స్పందించింది. ఈ వివాదంలో గెలుపు కోసం కంగనా చేయాల్సిన ప్రయత్నాలపై విద్యాబాలన్ ప్రశంసించారు. కంగనాకు విద్యాబాలన్ మద్దతు ప్రకటించింది. టీఈ3ఎన్ ట్రైలర్ లాంచింగ్ ఫంక్షన్‌లో కంగనా ధైర్యాన్ని కొనియాడుతూ విద్యాబాలన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాయి. 
 
వేరే ఎవరికైనా కష్టమొస్తే తోటి మహిళలు వారికి అండగా నిలుస్తుంటారని, అదే కష్టం వారికొస్తే నిశ్శబ్ధంగా వుండిపోతారు. కానీ కంగనా మాత్రం అలాకాకుండా గట్టిగా నిలబడి పోరాడుతోందంటూ కంగనా రనౌత్ ధైర్యాన్ని విద్యాబాలన్ ప్రశంసించింది. మరోవైపు తాజాగా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వీరి మధ్య గొడవపై స్పందించింది. హృతిక్, కంగనాల మధ్య ఏర్పడిన వివాదం త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
 
హృతిక్ రోషన్-కంగనా రనౌత్‌ల వివాదం త్వరలోనే సమసిపోతుందని.. దీనివల్ల ఎంత కష్టం ఉంటుందో తనకు తెలుసునని.. ఇప్పట్నుంచి వారిద్దరూ సరైన పంథాలో వెళ్ళాలని.. ఇద్దరూ ఓ నిర్ణయానికి వస్తారని భావిస్తున్నానని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి