కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడంటూ ట్విస్ట్ ఇచ్చి.. మొదటి పార్ట్‌లో చెప్పిన దర్శకుడు రాజమౌలి.. సెకండ్ పార్ట్.. కన్‌క్లూజన్‌లో దాన్ని నివృత్తి చేయడం మామూలే. ఆ విషయమై ఎవర్ని అడిగినా అదే చెబుతారు. కాగా, ఇటీవలే తమన్నా తన పోర్షన్‌ను పోషించింది. ఈ సందర్భంగా సెట్లో ఆమెను అడిగినా.. అదే సమాధానం చెప్పింది. కట్టప్ప ఎందుకు చంపాడంటే... చెబితే... ముందు రాజమౌళి నన్ను చంపేస్తాడంటూ సరదాగా వెల్లడించింది. ఇదే విషయాన్ని రానా కూడా వెల్లడించారు.
అయితే.. విషయం తెలిసిన నిర్వాహకుడు.. ఫోన్‌లోనే... ప్రభాస్ ద్వారా మాట్లాడించగా, అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేలా ఏర్పాటు చేశారు. అయితే ఆ సందర్భంలో సరదాగా ఓ సంఘటన జరిగింది. కట్టప్ప విషయం ప్రస్తావనకు రాగానే... రాజమౌళి చంపమన్నాడు.. చంపేశాడంటూ.. ఫోన్‌లో వాయిస్ విన్పించగానే.. అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.. స్పాంటేనియస్‌గా.. బాహుబలి ఇచ్చిన సమాధానమన్నమాట.