ఈ మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ - గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో నల్లమలుపు శ్రీనివాస్, 'ఠాగూర్' మధు నిర్మిస్తున్న "విన్నర్" కొత్త పోస్టర్లు, టీజర్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. విన్నర్ అంటే ఆషామాషీ విన్నర్ కాదు. రేస్ కోర్టులో గుర్రప్పందేల్లో నెగ్గుకొచ్చే విన్నర్.
ఇలాంటివి దావుద్ ఇబ్రహీంలాంటి గ్యాంగ్ స్టర్లు ఆడుకునే ఆటలు అని గతంలో విన్నాం. కానీ మన సాయిధరమ్ మాత్రం ఓ కామన్ రేసర్‌గా బరిలో దిగి దుమ్ము రేగ్గొట్టేస్తున్నాడు. గుర్రంపై రేసులో అతడు దూసుకెళుతున్న స్టయిల్ సూపర్భ్ అంటూ కాంప్లిమెంట్లు వచ్చాయి. సంక్రాంతి కానుకగా రిలీజైన టీజర్‌కి ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ముఖ్యంగా.. "నీలాంటోళ్లు అడుగడుగునా ఉంటారు. నాలాంటోడు ఒక్కడే ఉంటాడు" అంటూ సాయిధరమ్ చెప్పిన డైలాగులకు అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. కాగా, ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.