హాలీవుడ్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకునే తొలి సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హాలీవుడ్ యాక్షన్ స్టార్ విన్ డీజిల్‌తో కలిసి XXX రెండవ పార్ట్‌లో దీపిక నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టొరంటోకు దీపిక వెళ్ళింది. ఈ నేపథ్యంలో తొలిరోజు షూటింగ్ సెట్స్‌లో దీపికా పదుకునే, విన్ డీజిల్ సన్నివేశాలు ఫస్ట్ లుక్ అంటూ విడుదలయ్యాయి.