జగపతిబాబు, ప్రియమణి, శ్యామ్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం 'క్షేత్రం'. శ్రీబాలాజీ మూవీస్ పతాకంపై వై.ఎస్. ప్రతాప్‌రెడ్డి సమర్పణలో జి.గోవిందరాజు నిర్మించారు. నటుడు టి. వేణుగోపాల్ దర్శకుడిగా మారాడు. ఈ చిత్ర కథ నరసింహస్వామి దేవస్థానం నేపథ్యంలో రూపొందింది. ఇందులో ఐదు పాటలున్నాయి. వాటిని సుద్దాల అశోక్‌తేజ రాయగా, కోటి స్వరపరిచారు.