తెలుగుభాష సంస్కృతి చైతన్య యాత్ర

తెలుగు కవులు, కళాకారులు, తెలుగుభాషాభిమానులు, పాత్రికేయులు తదితర ప్రముఖులతో ఈ నెల 21 నుంచి 24వరకు తెలుగుభాష సంస్కృతి చైతన్య యాత్ర వైభవంగా జరుగనుంది. పత్రికా సంపాదకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు స్వర్గీయ నార్ల వెంకటేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని ఈ చైతన్య యాత్రను చేపడుతున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు, హిందీ భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు.

ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషను, సంస్కృతిక కాపాడుకునేందుకు లోక్ నాయక్ ఫౌండేషన్ ఈ కార్యక్రమం చేపడుందని చెప్పారు.

నార్ల వెంకటేశ్వరరావు స్వగ్రామమైన కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని కౌతవరం నుంచి ఈ నెల 21న ఈ యాత్రను ప్రారంభిస్తామని ఆయన వివరాలందించారు. భీమవరం నుంచి రాజమండ్రి, కాకినాడ, తుని, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వరకు ఈ చైతన్య యాత్ర సాగుతుందని లక్ష్మీప్రసాద్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి