ప్రాచీన కళలకు పూర్వవైభవం: ఆనం

ప్రాచీన కళలకు పూర్వవైభవం కల్పించే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రాచీన కళలకు పూర్వవైభవం తెచ్చే దిశగానే 1998వ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నంది నాటకోత్సవాలకు శ్రీకారం చుట్టిందని ఆయన గుర్తు చేశారు.

ఈ ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అన్ని జిల్లాల్లోనూ నిర్వహిస్తున్నామని ఆనం వెల్లడించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలను భావి తరాలకు వారసత్వంలో అందిద్దామని ఆనం ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.

నంది నాటకోత్సవాలు ప్రారంభ వేడుకల్లో ఆనం పైవిధంగా వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. మన సాహిత్య ప్రక్రియలో నాటకం పదునైందని ఆనం తెలిపారు. ప్రపంచ గర్వించదగ్గ కళాకారుడు ఎన్టీఆర్ స్మారక అవార్డు నగదు మొత్తాన్ని రూ. 50వేల నుంచి రూ. లక్షకు పెంచామని ఆనం ప్రకటించారు.

సురభి కళాకారుల ప్రోత్సాహాకాన్ని కూడా రూ. 5లక్షలకు పెంచామన్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి మరో ఆరువేల మంది వృద్ధ కళాకారులకు ఫింఛన్లు ఇవ్వనున్నట్లు ఆనం తెలిపారు.

వెబ్దునియా పై చదవండి