భావకవిత్వానికే వన్నె తెచ్చిన జాషువా: భూమయ్య

FILE
తెలుగు సాహిత్యంలోని భావకవిత్వానికే పద్మభూషణ్, కళాప్రపూర్ణ, గుర్రం జాషువ వన్నె తెచ్చారని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య అన్నారు. గబ్బిలం, ఫిరదౌసి వంటి కావ్యాల్లో జీవించే జాషువా 115వ జయంతిని తెలుగు యూనివర్శిటీలో బుధవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా అనుమాండ్ల మాట్లాడుతూ.. జాషువా జయంతిని ఈ నెల 28వ తేదీనే జరుపుకోవాల్సి ఉండగా.. దసరా సెలవుల కారణంగా రెండు రోజులు ఆలస్యంగా చేస్తున్నామని వివరించారు.

ఇదిలా ఉంటే.. ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా.. సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశారు. తక్కువ కులంలో జన్మించి అనేక అవమానాలు ఎదుర్కొన్న జాషువా.. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డారు. ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు.

వెబ్దునియా పై చదవండి