మహాకవి "శ్రీశ్రీ"కి ఘన నివాళులు

20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) జయంతి సందర్భంగా.. పలువురు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. హైదరబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న శ్రీశ్రీ విగ్రహానికి అభ్యుదయ రచయితల సంఘం, ప్రజా నాట్యమండలి ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అదేవిధంగా శ్రీశ్రీ జన్మదినాన్ని పురస్కరించుకుని అభ్యుదయ రచయిత సంఘం, సాహితీ స్రవంతి, అరుణోదయ సంస్థ, ప్రజానాట్యమండలి సంయుక్తంగా ఉత్సవాలు జరుపనున్నాయి.

విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా ఓ వెలుగు వెలిగిన శ్రీశ్రీ "మహాప్రస్థానం" రచన గురించి తెలియని వాడంటూ ఉండడు.

విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా శ్రీశ్రీ ప్రసిద్ధుడు.

వెబ్దునియా పై చదవండి