షేక్స్‌పియర్ కేంద్రానికి మంగేష్ కానుక

బ్రిటన్‌లోని స్ట్రాట్‌ఫోర్డ్‌లో ఉన్న షేక్స్‌పియర్ స్మారక కేంద్రానికి ప్రముఖ మరాఠీ కవి మంగేష్ పడగావ్‌కర్ అనూహ్యమైన బహుమానాన్ని ఇచ్చారు. షేక్స్‌పియర్ రాసిన "ది టెంపెస్ట్", "రోమియో అండ్ జూలియట్", "జూలియస్ సీజర్" పుస్తకాలను మరాఠీ భాషలోకి అనువదించిన మంగేష్, వాటిని కానుకగా అందజేశారు.

పడగావ్‌కర్ ఈ పుస్తకాలను తమకు అందించినట్లు షేక్స్‌పియర్ కేంద్రం అధ్యయన విభాగం డైరెక్టర్ డాక్టర్ పాల్ ఎడ్మండన్ వెల్లడించారు. ఈ పుస్తకాలను అందించేందుకు పడగావ్‌కర్ లండన్ నుంచి స్ట్రాట్‌ఫోర్డ్‌కు వచ్చినట్లు ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే... షేక్స్‌పియర్ స్మారక కేంద్రంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత స్థానం పొందిన భారతీయ కవి మంగేష్ పడగావ్‌కర్ కావడం భారతదేశానికే గర్వకారణం.

వెబ్దునియా పై చదవండి