ఆలయవాణి నారద తుంబుర మ్యూజిక్ అవార్డ్స్ 2014-2015

శనివారం, 26 మార్చి 2016 (18:56 IST)
దేవాలయ పరిరక్షణ, సనాతన ధర్మ రక్షణ ద్యేయంగా మహోద్యమంగా సాగుతున్న గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మరియు సేవ్ టెంపుల్స్ (USA) ఆధ్వర్యంలో ఆలయవాణి ఆధ్యాత్మిక వెబ్ రేడియోను ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నది. 24/7 హైందవ భక్తి గీతాలను, ప్రవచనాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం చేస్తుంది. ఆలయవాణి ఆధ్వర్యంలో "ఆలయవాణి నారద తుంబుర మ్యూజిక్ అవార్డ్స్ 2014-2015" నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రొ. వెలగపూడి ప్రకాశరావు మరియు సాంస్కృతిక ప్రచార సారధి డా. గజల్ శ్రీనివాస్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. 
 
2014-15 సంవత్సరంలో విడుదల కాబడిన తెలుగు భక్తి గీతాల ఆల్బంలకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని ఈ అవార్డు లను ప్రతి సంవత్సరము జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు విడుదల అయినటువంటి భక్తి గీతాల ఆల్బంలకు ఈ అవార్డులకు నామినేషన్స్ స్వీకరించబడతాయని తెలిపారు. 
 
· ప్రతి ఆడియో CD లో కనీసం 8 పాటలు విధిగా ఉండాలి. 
· గీతాలు తెలుగు భాషలోనే ఉండాలి 
· రీమిక్స్‌లు, పారడీ గీతాలు పోటీలకు అనర్హంగా భావిస్తాము 
· పూర్తిస్థాయి లో-మిక్సింగ్ అయిన గీతాలు MP3 ఫార్మాట్‌లోనే అనుమతించబడతాయి. 
· గాయకుల ఉచ్చారణ, స్పష్టత కూడా పోటీలో ఒక అంశంగా ఉంటాయి.
· పోటీ అంతా ఒకే కేటగిరిలో జరుగుతుంది. 
 
అవార్డులు 
మొదటి ఉత్తమ భక్తి ఆడియో ఆల్బం : Rs. 50,000/- జ్ఞాపిక, ప్రశంసా పత్రం.
ద్వితీయ ఉత్తమ భక్తి ఆడియో ఆల్బం: Rs. 40,000/- జ్ఞాపిక, ప్రశంసా పత్రం. 
తృతీయ ఉత్తమ భక్తి ఆడియో ఆల్బం: Rs. 30,000/- జ్ఞాపిక, ప్రశంసా పత్రం. 
 
మూడు ఉత్తమ జ్యూరి ఆల్బం అవార్డ్స్ ఒక్కొక్కటి Rs. 10,000/- జ్ఞాపిక, ప్రశంసా పత్రం.
 
మరియు ఇతర కేటగిరిలలో
ఉత్తమ సంగీత దర్శకుడు 
ఉత్తమ గాయకుడు 
ఉత్తమ గాయకురాలు 
ఉత్తమ రచయిత 
ఉత్తమ రికార్డింగ్ థియేటర్ 
పాపులర్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ఉంటాయని తెలిపారు 
 
2014-2015 సంవత్సరంలో విడుదల అయినటువంటి ఈ CDలను మూడు కాపీలను మాకు 31 మే 2016 వ తేది లోపు అందేటట్లుగా పంపగలరు. CDలతో పాటుగా నిర్మాత సంతకం చేసినటువంటి లేఖతో జత చేసి పంపాలి. దీనితో పాటుగా గాయకులు, సంగీత దర్శకులు పూర్తి పేర్లు తప్పక పొందుపరచవలసి ఉంటుంది. 
 
ఎంట్రీ అందుకున్న ప్రతి CD నిర్మాతకు సేవ్ టెంపుల్స్, ఆలయవాణి వెబ్ రేడియో అభినందన పత్రం అందజేయ బడుతుంది. ఈ అవార్డు కార్యక్రమాన్ని 6 ఆగష్టు 2016న విజయవాడలో జరిగే కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేయబడతాయని ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రో. వెలగపూడి ప్రకాశరావు మరియు సాంస్కృతిక ప్రచార సారధి డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి