భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ శాస్త్ర ప్రచారం, ప్రజాదరణ, వ్యాప్తి

బుధవారం, 20 అక్టోబరు 2021 (17:59 IST)
విజ్ఞాన్ ప్రసార్(వి.పి) తన పతాక యోజనగా చేపట్టిన/ చేపడ్తున్న 'భారతీయ భాషల్లో శాస్త్ర ప్రచారం, ప్రజాదరణ&వ్యాప్తి (స్కోప్) లేక విజ్ఞాన్ భాష యోజనలో దేశంలోని పలు భాషల ప్రతినిధులు అక్టోబర్ 20, 2021 న భారత అంతర్జాతీయ కేంద్రం, న్యూఢిల్లీలో ఒకరోజు కార్యశాలకు హాజరయ్యారు.

 
హిందీ, ఆంగ్లంలోనే కాక ఉర్దూ, కాశ్మీరీ, డోగ్రీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తమిళ,తెలుగు, బెంగాలీ,అస్సామీ, మైథిలి, నేపాలీ భాషల నిష్ణాతులైన 50 మంది ప్రతినిధులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన శాస్త్ర ప్రచారకులు అమలు పర్చదగిన కార్యాలను రూపొందించడమే కాకుండా ఇప్పటి వరకు జరిగిన కార్యాచరణను సమీక్షించారు.


ఈ ప్రతినిధుల్లో విశ్వ విద్యాలయాల, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక కేంద్రాల,  దేశంలోని రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక విభాగాల ప్రచురణకర్తల ప్రతినిధులు ఉన్నారు.  వారందరూ వివిధ యోజనలలోని అద్భుతమైన ప్రచురణలను అందరూ ఎంతగానో మెచ్చుకొనే విధంగా ప్రదర్శించారు. 
'
 
త్వరితగతిన ప్రభావ భరితంగా తమ తమ మాతృభాషల్లో అన్ని సామాజిక స్థాయిల్లో శాస్త్ర ప్రచారం నిర్వహించడానికి ఇది తొలిమెట్టు. అందుకే అన్ని మాధ్యమాల నుపయోగించి వస్తుసామాగ్రిని తీర్చిదిద్ది అభివృద్ధి చేయడానికి మన దేశంలో విజ్ఞాన్ ప్రసార్ శ్రీకారం చుట్టింది.' అని వివిధ భాషల్లో స్కోప్ రూపకర్త, విజ్ఞాన్ ప్రసార్ సంచాలకులు శ్రీ నకుల్ పరాశర్ ఉద్ఘాటించారు.


ఈ కార్యాచరణలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని అతి స్వల్పకాలంలో అంకిత భావం కలిగిన శాస్త్ర ప్రచార బృందం అధిగమించిందని వారు వ్యాఖ్యానించారు. డా. టి వి వెంకటేశ్వరన్, సైంటిస్ట్ ఎఫ్, భారతీయ భాషల్లో స్కోప్ సమన్వయకర్త 'టెలివిజన్ మాధ్యమం ఉనికిలోకి రాగానే రాతప్రతులు ఉనికి కోల్పోతాయని కొంతమంది సూత్రీకరించారని కానీ వాట్సాప్ నుంచి ట్విట్టర్ వరకూ వ్రాతయే ముఖ్యంగా మాతృభాషలో రాయడమే ప్రాముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచార వ్యాప్తికి  పూనుకుంద'ని తెలియజేశారు. 'విజ్ఞాన్ భాష' యోజనలో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో కలిసి తగిన వస్తుసామాగ్రిని భారతీయ భాషల్లో తెస్తామని వారన్నారు. 

 
 సదస్సు ఉద్దేశాలు, లక్ష్యాలు 
* శాస్త్రప్రచారం, ప్రజాదరణ కార్యక్రమ విస్తరణలో వివిధ సంస్థల సాఫల్యతలను గుర్తించడం.
 
* శాస్త్రప్రచారం, ప్రజాదరణ, విస్తరణలో ఆయా సంస్థల కార్యకలాపాలను విశ్లేషించి ఆ సంస్థల ఉద్యమాలను, వివిధ సంస్థల మధ్య గల సంబంధాలను బలోపేతం చేసి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడం.
 
*కోవిడ్- 19 సమయంలో స్కోప్ ముందడుగు వేసిన కార్యకలాపాలను సమీక్షించి ప్రజలు వ్యాక్సిన్ వేసుకోవడంలో వున్న అపోహలు తొలగించడం.
 
*సైన్స్ క్లబ్బులను మొదలుపెట్టి నిర్వహించడం, చేతులనుపయోగించి చేయదగిన సైన్స్ కార్యకలాపాలను మొదలుపెట్టడం, సైన్స్ అభ్యసన కిట్ల రూపకల్పన, కవితలు ఇతర సాహిత్య ప్రక్రియలతో సైన్స్ ప్రచారం, సినిమాలు, డాక్యుమెంటరీల ప్రదర్శనలు.
 
*వివిధ భాషల్లో తమ స్వంత ఛానెళ్ల ద్వారా విస్తృతంగా దేశం నలుమూలలా శాస్త్ర ప్రచారం చేరుకోవడం.

 
ఎందుకు భారతీయ భాషలు వాడాలి?
శతాబ్దాల క్రితం వేర్వేరు భాషల్లో గల శాస్త్ర భావనలను, పద సంచయాలను స్థానిక భాషల్లోకి అనువదించాలి. భారత స్వాతంత్ర్య సమర సమయంలోనే ఈ ప్రయత్నాలు జరిగాయి.
 
* లక్షల కొలది విద్యార్థులు తమ పాఠశాల విద్య తమ మాతృభాషలోనే అభ్యసిస్తున్నారు. వారికి సమకాలీన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విజ్ఞాన సమాజం నిర్మించడానికి, శాస్త్రీయ దృక్పథం అలవడడానికి తప్పనిసరి అవసరం.
 
* మాతృభాషలో చదవడం, అలోచించడం వారి వినూత్న ఊహాశక్తిని ద్విగుణీకృతం చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు