చెన్నయ్‌లో కార్తీక్ ఫైన్ ఆర్ట్స్ 36వ వేడుకలు ప్రారంభం

WD
WD
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో ప్రముఖ సాంస్కృతిక సంస్థ కార్తీక్ ఫైన్ ఆర్ట్స్ 36వ ఆర్ట్ ఫెస్టివల్ బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ మృదంగ విధ్వాంసుడు జె.వైద్యనాథన్‌కు ఇసైపెరోలి అవార్డుతోనూ, ప్రముఖ నాట్యకళాకారిణి లావణ్య శంకర్‌ను నటనమామణితో సత్కరించారు. ఈ సందర్భంగా వారికి 25 వేల రూపాయల నగదు బహుమతిని కూడా అందజేశారు.

ఈ అవార్డు, నగదు బహుమతిని మద్రాసు హైకోర్టు జస్టీస్ చొక్కలింగం, తమిళనాడు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కె.అల్లావుద్దీన్‌‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే, ముద్ర కార్యదర్శి ముద్రా భాస్కర్‌కు 2010 సంవత్సరానికి ఎక్స్‌లెన్స్ అవార్డుతో పాటు డీకేపట్టమ్మాళ్ అవార్డు ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో అమృతా వెంకటేష్, శబరీత్నం, కార్తీక్ ఫైన్ ఆర్ట్స్ ప్రెసిడెంట్ ఏవీఎస్.రాజాలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత సుభంజలీ సద్గురుదాస్ చేసిన భరతనాట్య కచేరి ప్రతి ఒక్కరినీ ఆలరించింది. ఈ వేడుకలు వచ్చే యేడాది జనవరి 17వ తేదీ వరకు జరుగనున్నాయి.

వెబ్దునియా పై చదవండి