"మీ భార్య ఏం మాట్లాడినా సరే.. తలను పైకీ కిందకి ఊపాలి..!" అన్నాడు సోమరాజు
"ఎందుకు..?"అడిగాడు గిరీశం
"ఎందుకంటే.. ఈ యోగా ప్రక్రియ వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అంతేకాకుండా బీపీ కంట్రోల్‌లో వుంటుంది. గుండెపోటు రాదు.. అన్ని చికాకులు దూరం అవుతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తలను అడ్డంగా ఊపారో దీనివల్ల అన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి... బదులిచ్చాడు సోమరాజు.