మార్చి 9న వస్తున్న 'మదన్మోహిని'

బుధవారం, 29 ఫిబ్రవరి 2012 (17:02 IST)
తమిళ శృంగార తార, 'మృగం' ఫేం సోనా ప్రధాన పాత్రలో నటించగా తమిళనాడు, కేరళలో సంచలన విజయం సాధించిన 'పత్తుపత్తు' చిత్రాన్ని సిరిమేఘనా క్రియేషన్స్‌ సంస్థ 'మదన్మోహిని' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

సినిమా గురించి నిర్మాత ఆర్‌.జి. మాట్లాడుతూ... సినిమా దర్శకుడైన భర్త కళ్లు కప్పి టీనేజ్‌ యువకుడితో ప్రేమకలాపాలు సాగిస్తున్న యువతి అనూహ్యంగా ఓ రోజు భర్త కంట్లో పడుతుంది. ఆ తర్వాత జరిగిన సంఘటనలే చిత్ర కథాంశం.

రొమాన్స్‌, శృంగారం, మర్డర్‌ మిస్టరీ ప్రధానాంశాలుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 9న విడుదల కానుంది.. అని తెలిపారు. కలైవాసన్‌ విజయ్‌, బోస్‌ వెంకట్‌, కృష్ణ, లక్ష, భియాల్‌ దేశాయ్‌ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు : బొబ్బా, కెమెరా : శ్రీగణేషన్‌, సంగీతం : గణేషన్‌, సమర్పణ : యస్‌.రెడ్డి, నిర్మాత : ఆర్‌.జి., దర్శకత్వం : సత్యం.

వెబ్దునియా పై చదవండి