సెన్సార్‌ పూర్తి చేసుకున్న 'అడవి కాచిన వెన్నెల'

శుక్రవారం, 30 మే 2014 (12:29 IST)
'ఋషి' ఫేం అరవింద్‌కృష్ణ హీరోగా మీనాక్షిదీక్షిత్‌, పూజరామచంద్రన్‌ హీరోయిన్స్‌గా మూన్‌లైట్‌ డ్రీమ్స్‌ పతాకంపై అక్కి విశ్వనాధరెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'అడవి కాచిన వెన్నెల'. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది.
 
ఈ సందర్భంగా దర్శకనిర్మాత అక్కి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ - ''మా 'అడవి కాచిన వెన్నెల' చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. జూన్‌ నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రెగ్యులర్‌ చిత్రాలకు భిన్నంగా ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ చిత్రం తప్పకుండా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందన్న నమ్మకం నాకు వుంది. సినిమా ఔట్‌పుట్‌ పట్ల నాతో పాటు యూనిట్‌లోని అందరూ చాలా హ్యాపీగా వున్నారు. సినిమా ఇంత బాగా రావడానికి ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌ నాకు ఎంతో సహకరించారు. హై టెక్నిల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించి మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు. 
 
అరవింద్‌కృష్ణ, మీనాక్షిదీక్షిత్‌, పూజరామచంద్రన్‌, రుషి, వినోద్‌కుమార్‌, సురేష్‌, తాగుబోతు రమేష్‌, చిత్రం శ్రీను, జోగి బ్రదర్స్‌, పృధ్వి, ప్రవీణ్‌, కళ్ళు క్రిష్ణారావు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం: కార్తీక్‌ రోడ్రిగ్విజ్‌, డా|| జోస్యభట్ల, ఫైట్స్‌: వెంకట్‌, కొరియోగ్రఫి: శివశంకర్‌, సురేష్‌వర్మ, విఎఫ్‌ఎక్స్‌ అండ్‌ పబ్లిసిటీ డిజైన్స్‌: జి.ఎస్‌.ఎస్‌.పి. కళ్యాణ్‌, రచన - దర్శకత్వం - నిర్మాత: అక్కి విశ్వనాధరెడ్డి.

వెబ్దునియా పై చదవండి