'గూఢచారి' కథ చాలా బ్యాడ్‌గా ఉంది... వర్కవుట్ కాదు అన్నాడు... అడవి శేష్
గురువారం, 2 ఆగస్టు 2018 (18:44 IST)
అడివి శేష్, శోభితా ధూళిపాళ జంటగా నటించిన చిత్రం గూఢచారి. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్, విస్తా డ్రీమ్ మర్చంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన గూఢచారి చిత్రం ఆగస్ట్ 3న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలో అడివి శేష్ మాట్లాడుతూ... 2004లో తెలుగు నేర్చుకుంటున్న సమయంలో ఈ కాన్సెప్ట్ ఐడియా వచ్చింది. నేను రాసుకున్న ఫైల్‌ను దాచుకున్నాను. దాన్ని క్షణం రిలీజ్ తర్వాత డైరెక్టర్ శశికిరణ్‌కి చూపించాను. తను దాన్ని చదివి ఇది చాలా బ్యాడ్‌గా ఉంది. వర్కవుట్ కాదు అన్నాడు. మూల కథను బేస్ చేసుకుని పది నెలలు కష్టపడి నేను, రాహుల్, శశి స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే తయారుచేశాం. ఎప్పుడో కన్న కల ఇప్పుడు నిజమైంది. మంచి సినిమా అయినా, చెత్త సినిమా అయినా.. ఏ సినిమా అయినా సరే కష్టపడాల్సిందే.
నేను డైరెక్టర్ శశితో సింక్ కావడానికి టైమ్ పట్టింది. తనను నేను నమ్మితే... తను నన్ను నమ్మాడు. తను సినిమాను చాలా బాగా గైడ్ చేశాడు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి హీరో అని చెప్పవచ్చు. తనతో క్షణం చేశాను. ఈ సినిమాకు అద్భుతమైన రీ రికార్డింగ్ చేశాడు. శోభితకు థాంక్స్. అలాగే సుప్రియను 22 ఏళ్ల తర్వాత తెలుగులో మా సినిమాతో మళ్లీ నటింపచేశాం. ఓ మంచి యూనిట్‌తో మంచి సినిమా చేశామనే భావన కలిగింది. అలాగే ఈ సినిమాలో నా చిన్నప్పటి పాత్రను సుధీర్ బాబు తనయుడు... కృష్ణగారి మనవడు చేశాడు. ఈ సినిమాను హిందీలోనూ.. తమిళంలోనూ రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించిన మా ప్రొడ్యూసర్స్‌కి థాంక్స్ అన్నారు.
డైరెక్టర్ శశికిరణ్ తిక్క మాట్లాడుతూ...శేషు విజన్‌ని నేను షేర్ చేసుకోగలనా అనుకున్నాను. అయితే 9-10 నెలలు నేను, రాహుల్, శేష్ కలిసి స్క్రిప్ట్ రాశాం. మధ్య మధ్యలో అబ్బూరి రవి గారిని కలిసేవాళ్లం. ఆయన దగ్గర రియల్ ఫిలిం స్కూల్ అంటే ఏంటో నేర్చుకున్నాను. ప్రతి సన్నివేశాన్ని బెటర్‌గా ఎలా రాయవచ్చో అనేది ఆయనే నేర్పిస్తూ మంచి మాటలు ఇచ్చారు. శ్రీచరణ్ అద్బుతమైన సంగీతం అందించాడు అన్నారు.
కోన వెంకట్ మాట్లాడుతూ... ప్రేక్షకులు టీజర్‌ను చూసే సినిమా ఎలా ఉందో డిసైడ్ చేసుకుని సినిమాకి వెళ్లాలా వద్దా? అని నిర్ణయించుకుంటున్నారు. శేష్ నాకు తెలిసి ఆంధ్ర అమీర్ ఖాన్ అని నా ఫీలింగ్. సినిమా చేయడానికి ఎందుకు ఇన్నిరోజులు పడుతుందని నేను ఆలోచించాను. అయితే టీజర్ చూసిన తర్వాత షాక్ అయ్యాను. తెలుగు సినిమా స్టాండర్డ్స్‌ని పెంచిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఎందుకంటే అంత మంచి క్వాలిటీ సినిమా ఇది. మంచి సపోర్టివ్ టీం దొరికింది. అనీల్ సుంకర, విశ్వప్రసాద్, అభిషేక్ గారు సినిమా యూనిట్‌కు అందించిన సపోర్ట్ కారణంగానే ఇది సాధ్యమైందని భావిస్తున్నాను. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ అన్నారు.
శోభితా దూళిపాల మాట్లాడుతూ...తెలుగులో నా మొదటి చిత్రం. నేను తెలుగు అమ్మాయినే. ఓ మంచి టీంతో పనిచేశాననే ఫీలింగ్ కలిగింది. ప్రతి క్యారెక్టర్‌కు ప్రాముఖ్యత ఉంటుంది. మంచి ఎమోషన్స్ ఉన్నాయి అన్నారు. నిర్మాత భరత్ చౌదరి మాట్లాడుతూ... మా విశ్వప్రసాద్‌తో సహా ఇతర నిర్మాతలకు ముందుగానే అభినందనలు. ఈ సినిమా పేరుతో పాటు డబ్బులు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది. శేష్ గారు.. ఆయన టీంతో పనిచేయాలని ఉంది అన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ... శశి నాకు ఎప్పటి నుండో తెలుసు. ఇద్దరం కలిసి శేఖర్ కమ్ముల గారి వద్ద పనిచేశాం. మంచి కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమాకు పనిచేసింది. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు అన్నారు.
డి.సురేశ్ బాబు మాట్లాడుతూ...శేష్.. సినిమాలపై ఆసక్తితో అమెరికా నుండి ఇక్కడకు వచ్చాడు. క్షణం తర్వాత చేసిన చిత్రమిది. విజువల్స్ చూస్తేనే సినిమా ఏంటో అర్థం చేసుకోవచ్చు. 160 రోజుల్లో 168 లొకేషన్స్‌లో ఈ సినిమాను షూట్ చేయడం గొప్ప విషయం. నిర్మాతలందరికీ అభినందనలు అన్నారు.