ఆటోనగర్ సూర్యకి సెన్సార్ A సర్టిఫికేట్: పెద్దలకు మాత్రమే!

బుధవారం, 25 జూన్ 2014 (11:41 IST)
ఆటోనగర్ సూర్యపైనే ప్రస్తుతం సినీ ప్రేక్షకుల దృష్టి పడింది. ఈ నెల 27వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. అయితే ఆటో నగర్ సూర్యకు A(పెద్దలకు మాత్రమే) సర్టిఫేకేట్ వచ్చింది. రెండు గంటల 37 నిముషాలు.. టైటిల్స్‌తో కలిపి ఉండనుంది. నాగచైతన్య, దేవకట్టా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'ఆటోనగర్‌ సూర్య'. 
 
దర్శకుడు మాట్లాడుతూ ''పొలిటికల్‌ థ్రిల్లర్‌ తరహాలో సాగే కథ ఇది. కథనానికి ప్రాధాన్యముంది. నాగచైతన్య, సమంత జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరిస్తుంది. వీరి పాత్రలను కొత్త తరహాలో తీర్చిదిద్దే ప్రయత్నం చేశాము'' అన్నారు. ఆ చిత్రంలో నాగచైతన్య టైటిల్ రోల్‌లో సూర్య పాత్రలో కనపించనున్నారు.

వెబ్దునియా పై చదవండి