సాయిరామ్ శంకర్, అదోనిక జంటగా నటించిన ప్రేమకథా చిత్రం రోమియో. ఈ చిత్రానికి పూరి శిష్యుడు గోపి గణేష్ దర్శకత్వం వహించారు. తమ్ముడు సాయిరాం శంకర్ కోసం పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి కథను స్వయంగా సమకూర్చారు. వాస్తవంగా, ఈ సినిమా మూడేళ్ల క్రిందటే పూర్తయ్యింది. అయితే, ఫైనాన్షియల్ సమస్యల వల్ల విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది.
ఎట్టకేలకు, ఈ చిత్రం అన్ని అవాంతరాలను అధిగమించి అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రోమియో ట్రైలర్స్‌కు, ప్రోమోస్‌కు పరిశ్రమలోని ప్రముఖల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ లాంటి టాప్ మ్యూజిక్ డైరక్టర్లు ఈ చిత్రం విజువల్స్‌ను విపరీతంగా మెచ్చుకున్నారు.