2016లో పరిమిత బడ్జెట్‌తో తీసిన బిచ్చగాడు సినిమా విజయ్ ఆంథోనీకే కాకుండా తెలుగులో విడుదలచేసిన నిర్మాతకు రూపాయికి 50 రూపాయలు వచ్చాయి. దీనికి కారణం ప్రేక్షకులు తమను తాము ఓన్ చేసుకోవడమే మదర్ సెంటిమెంట్‌తోపాటు ఊపిరి సలపని ట్విస్ట్‌లతో ఆ సినిమా వుండడమే. మరలా ఆ సినిమా తర్వాత విజయ్ ఆంథోని కొన్ని సినిమాలు చేసినా మంచి కథలతో చేశాడు. కానీ వాటికంటే మరలా బిచ్చగాడు సీక్వెల్ ఎప్పుడు అంటూ వెళ్లినచోటల్లా అడుగుతున్నారు. అందుకే బిచ్చగాడు2కు ఏడేళ్ళ గేప్‌లో వచ్చాడు. ఈసారి చెల్లి సెంటిమెంట్‌తో వస్తున్నట్లు ముందుగానే చెప్పేశారు. తమిళంలో ఆంథోని నిర్మిస్తూ నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులోకూడా నేడే విడుదలైంది. మరి ఎలా వుందో చూద్దాం.
కథ:
విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంథోని) లక్షకోట్లు వున్న బిజినెస్‌మేన్ కొడుకు. తండ్రికి అనారోగ్యంతో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పైనే వుంచుతారు. కానీ ఈ ఆస్తికోసం కన్నేసిన పర్సనల్ అసిస్టెంట్ దేవ్‌గిల్, ఫ్యామిలీ డాక్టర్, మేనేజర్ ముగ్గురూ విజయ్ ముందు మంచివాడిగా నటిస్తూ గోతులు తీసే రకం. గురుమూర్తి తండ్రిని ఆసుపత్రిలోనే చంపేసి, ఆ తర్వాత విజయ్ గురుమూర్తిని కూడా చంపేసి ఆస్తిని కాజేయాలను ప్లాన్ చేస్తారు. అందుకు మనిషి బ్రెయిన్ ప్లాంటేషన్ డాక్టర్‌ను సంప్రదించి అనాథలాంటి బిచ్చగాడు సత్య (విజయ్ ఆంథోనీ)కి మత్తుమందు ఇచ్చి గురుమూర్తి బ్రెయిన్ ను సత్య తలలో పెట్టిస్తారు.
అంతరం గురుమూర్తిని చంపేసి సత్యను ఆ ప్లేసులో ఉంచుతారు. ఆ తర్వాత గురుమూర్తి ఆకారంలో వున్న సత్య ఆ ముగ్గురు చెప్పింది చేయనంటాడు. తన చెల్లెలు కోసం వెతకలానుకుంటాడు. సత్య ప్రవర్తన మనకే హాని అని సత్యను చంపేయాలని ఆ ముగ్గురూ చూడడంతో ఆ ముగ్గురినీ సత్య చంపేసి సముద్రంలో పడేస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది? విజయ్ గురుమూర్తిలా వచ్చిన సత్య అనుకున్నదిసాధించాడా? పబ్లిసిటీలో చెబుతున్నట్లు గమిలి అనేది మాటటకు అర్థం ఏమిటి? అనేదిమిగిలిన సినిమా.
విశ్లేషణ:
ఈ సినిమా ఓపెనింగ్ షాట్‌తోనే విషయం వుందని తెలిసిపోతుంది. పెద్ద బిజినెస్‌మేన్‌గా విజయ్ ఆంథోనీ టేకింగ్ నుంచి ఫ్టాట్ ఫారమ్‌లో బిచ్చగాడుని చూపించే విధానం కథలో ఇన్‌వాల్వ్ అయ్యేలా చేశాడు. లక్ష కోట్లను రాబట్టుకోవడం గురుమూర్తి చుట్టూ ఉన్న నమ్మకస్తులా ఎందుకున్నారనేందుకు కూడా ఓ లాజిక్ చూపించాడు. ఇలా ప్రతి సన్నివేశంలింక్ కలుపుతూ రాష్ట్ర సి.ఎం.కూ లింక్ పెడుతూ సాగిన కథనం ఆసక్తికరంగా వుంది. మధ్యలో రెండుపాటలు యూత్ ఎంటర్‌టైనింగ్ కోసమే పెట్టినా ఎక్కడా హద్దుమీరలేదు. కావ్యథాపర్‌తో సన్నివేశాలు పరిమితంగానే వున్నా ఆమెను ఎవాడ్ చేసే సన్నివేశాలు వంటికి కథలో భాగంగా అనిపిస్తాయి.
ఇందులో నటనా పరంగా విజయ్ ఆంథోనీ గురించి చెప్పేది ఏమీలేదు. రిచ్‌మేన్, బిచ్చగాడు పాత్రల్లో వేరియేషన్ తనకు తగినవనిధంగానే చూపించాడు. ఇందులో ప్రతీపాత్రా కథకు అనుగుణంగానేవున్నాయి. ఎక్కడా ఎక్స్‌ట్రా ప్లేయర్స్ కనిపించరు. ఈ సినిమా ద్వారా బికిలీ అనే పదాన్ని విజయ్ ఆంథోనీ పరిచయం చేశాడు. ఆ బికిలీ అనే పదం గురించి ఆయన చెప్పి స్పీచ్ లాజిక్‌గా వుంది. డబ్బున్నవారు లేనివారిని తన కాలికింద అణివేస్తున్నారనే పాయింట్‌లోంచి పుట్టిందే ఈ బికిలీ. అందుకే వారిని ఆదుకోవాలని సామాన్యుడికి సరసమైన దరకు అందుబాటులో వుండేలా షాపింగ్ కాంప్లెక్స్‌లు కట్టడం అనేది కొత్త ప్రక్రియ. మరి అన్నీమంచి పనులు చేస్తే రాజకీయపార్టీలు, లాయర్లు ఊరుకుంటారా. వారినుంచి వచ్చిన అడ్డంకులను ఏవిధంగా ముగింపు ఇచ్చాడనేది క్లయిమాక్స్.
సంగీతం కూడా విజయ్ ఆంథోనీ ఇవ్వడంతో కథకు అనుగుణంగా సన్నివేశానికి అతికినట్లు నేపథ్యసంగీతాన్ని బాగా డీల్ చేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సన్నివేశాలు సినిమాటిక్‌గా వున్నా సహజంగా ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు ఎమోషన్స్ సీన్స్‌ను బాగా చూపించాడు.
ఇంతకుముందు విజయ్ ఆంథోనీ చేసిన సలీమ్, నకిలీ నుంచి విజయ్ రాఘవన్ వరకూ ఏదో కొత్త అంశాన్ని టచ్ చేసేవాడు. ఈసారి కూడా అదే చెప్పాడు. ఆ చెప్పేవిధానం అందరికీ కనెక్ట్‌అయ్యేలా వుంది. ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడొచ్చు. అందుకే బిచ్చగాడు సినిమాకు ధీటుగా ఈ బిచ్చగాడు2 వుందని చెప్పొచ్చు.