గోపిచంద్ ఏడాది తర్వాత గౌతమ్ నంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామ్ చరణ్ రచ్చ, రవితేజ బెంగాల్ టైగర్ వంటి సినిమాలను తెరకెక్కించిన సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యాక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో కేథరిన్, హన్సిక హీరోయిన్లుగా కనిపించారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో చూద్దాం.. ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ధనికుడిగా గౌతమ్ నంద కనిపిస్తాడు.
అయితే ఇతనికి ఆడంబరత నచ్చదు. పార్టీలు, పబ్‌లు, మందులతో విసిగిపోయి.. కొత్తదనం, కొత్త అనుభూతి కోసం అన్వేషిస్తాడు. తన జీవితంలో ధనికుడిగా కాకుండా 30 రోజుల పాటు ధనానికి, జల్సాలకు దూరంగా ఉండాలనుకుంటాడు. గౌతమ్, నంద అనే డ్యుయెల్ రోల్‌లో గోపి కనిపిస్తాడు. ధనికుడిగా గౌతమ్, నేరస్థుడిగా నంద కనిపిస్తాడు. ఈ క్రమంలో తనలాగే వున్న నంద గురించి తెలుసుకుని అతని స్థానానికి గౌతమ్ వెళ్తాడు. కానీ 30 రోజుల తర్వాత నంద.. గౌతమ్ స్థానాన్ని అతనికిచ్చాడా? ఇందుకోసం పోరాటం ఎందుకు జరిగింది? హత్యా నేరస్థుడైన నందకు-గౌతమ్‌కు ఏంటి సంబంధం? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో బిజినెస్‌మెన్‌గా గౌతమ్‌గా గోపిచంద్ నటించాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అదిరింది. హన్సిక, కేథరిన్ గ్లామర్ పండించారు. సెంటిమెంట్ డోస్ కాస్త ఎక్కువైందే తప్ప.. యాక్షన్, రొమాన్స్ వంటి సీన్లు పండాయి. గోపిచంద్ నటన సినిమాకు హైలైట్ అయ్యింది. బ్యాంకాక్, దుబాయ్, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరించిన సీన్లు సూపర్బ్ అనిపించాయి.