నట్టి కుమార్ మాట్లాడుతూ, యథార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. తనకు జరిగిన అన్యాయానికి ఒక ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనేదాన్ని చాలా వినూత్నంగా చూపిస్తున్నాం. వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో అత్యద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని మలిచాం. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారు. అలానే సుపర్ణ మలాకర్ అనే బెంగాల్ అమ్మాయి ఇందులో సెకెండ్ హీరోయిన్ గా ఓ పవర్ ఫుల్ కాల్ గర్ల్ పాత్రలో నటించింది అని అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్, సినిమాటోగ్రాఫర్: వెంకట హనుమ నరిసెటి, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: కె.వి. రమణ, నిర్మాత: నట్టి క్రాంతి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నట్టికుమార్.