దుమ్మురేపుతున్న 'ఓ వ‌సుమ‌తి' సాంగ్ వీడియో టీజ‌ర్ (Teaser)

శనివారం, 14 ఏప్రియల్ 2018 (09:06 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు, దర్శకుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం "భ‌ర‌త్ అనే నేను" ఈ చిత్రం వచ్చే 20వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా, ఇప్ప‌టికే విడుద‌లైన చిత్ర టీజ‌ర్‌, ట్రైలర్‌, పోస్ట‌ర్స్‌కి ఫుల్ రెస్పాన్స్ రావ‌డంతో మూవీ కూడా భారీ విజ‌యం సాధిస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.
 
ఇకపోతే, దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం సినిమాకి చాలా ప్ల‌స్ అవుతుంద‌ని నమ్ముతున్నారు. ఈ చిత్రంతో మరో ఉత్తరాది భామ కైరా అద్వానీ తొలి సారిగా తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇవ్వనుంది. అయితే సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా శనివారం ఓ వ‌సుమ‌తి సాంగ్ వీడియో టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇది అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. యాజిన్‌, నిజార్‌, రిటా పాడిన పాట‌పై మీరు ఓ లుక్కేయండి. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు