తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు రాత్రి శ్రీమలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తజనకోటికి కనువిందు చేశారు. లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాటుతూ స్వామి ఈ వాహనంపై కొలువుదీరుతాడు. ఈ వాహనసేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వత ఫలాన్ని ఇస్తుంది.
ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చాడు. తన భక్తులకు అడగకుండానే వరాలిచ్చే దేవదేవుడు వేంకటేశ్వరుడు.. అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే కాదు... స్వామి శాశ్వత కైవల్యం ప్రసాదించే కల్పతరువు.