భక్తులు తిరుమలకు రావద్దండి... కొండంత జనం.. రేపే గరుడ సేవ..

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (16:13 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టం గరుడసేవ రేపు రాత్రి జరుగనుంది. గరుడసేవను తిలకించేందుకు ఇప్పటికే రెండున్నర లక్షలమంది జనం తిరుమలకు చేరుకున్నారు. తిరుమల ఇప్పటికే భక్త జనసంద్రంగా మారిపోయింది. ఎక్కడ చూసినా జనం.. ఎటు చూసినా భక్తజనం. గదులు లేవు. రోడ్లపైనే అన్నీ. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో టిటిడి చేతులెత్తేసింది.
 
భక్తులు ఎక్కువ ఉన్నారు క్యూ లైన్లలో జాగ్రత్తగా వెళ్ళండి... అంటూ టిటిడి ప్రకటనలను చేస్తోంది. మరోవైపు ఈ రోజు అర్థరాత్రి నుంచి ద్విచక్రవాహనాలను నిలిపివేయనున్నారు. రెండు ఘాట్ రోడ్లు 24 గంటలు అందుబాటులో ఉంచారు. అలిపిరి పాదాల మండపం, శ్రీవారి మెట్టు మార్గాలను భక్తులను 24 గంటల పాటు అనుమతిస్తారు. 100 మెట్లకు ఒక సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు రక్షణ కల్పిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు