మాగీ నూడుల్స్ : బీహార్ లోనూ అమితాబ్, ప్రీతి, మాధురీపై కేసు

బుధవారం, 3 జూన్ 2015 (08:45 IST)
మ్యాగీ నూడుల్స్ వివాదం దాని ప్రచారకర్తలకు ఎక్కడ లేని కష్టాలు తెచ్చిపెడుతోంది. డబ్బుల కోసం బ్రాండ్ అంబాసిడర్లుగా వారి చెప్పించిన మాటలను చిలకపలుకుల్లాగా మాట్లాడిన పాపానికి అనుభవించక తప్పడం  లేదు. తాజాగా బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటాలపై బీహార్ లో కేసు నమోదయ్యింది. 
 
యూపీలో ఈ ముగ్గురిపై కేసులు నమోదు చేయగా, బీహార్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అమితాబ్, మాధురీ, ప్రీతిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ముజఫర్పూర్ కోర్టు ఆదేశించింది.
 
ఇక మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తిదారులకు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. మ్యాగీ ఉత్పత్తులు సురక్షితం కాదని లాబ్ పరీక్షల్లో తేలినట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కేరళలో వీటిపై నిషేధం విధించారు.

వెబ్దునియా పై చదవండి