తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఎకౌంట్‌లో సినిమా రిలీజ్‌కి ముందు రోజు పోస్ట్ చేసిన లయన్ పోస్టర్‌ని రిలీజ్ తర్వాత త్రిష డెలీట్ చేసిందట. తెలుగుతోపాటు తమిళ సినిమాల్లోనూ మార్కెట్ వున్న త్రిష ప్రతీ కదలకపై చెన్నై మీడియా ఓ కన్నేసుంటుంది. అందులో భాగంగానే లయన్ సినిమాకి రివ్యూలు రాసిన కోలీవుడ్ మీడియా... ఆ సినిమాకి 1 రేటింగ్ ఇచ్చాయట.
సినిమాకు ఆశించినంత గొప్ప టాక్ రాకపోవడంతో డిజప్పాయింట్ అయిన త్రిష అంతకు ముందు తాను పోస్ట్ చేసిన లయన్ పోస్టర్‌ని డెలీట్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఆమె కష్టకాలంలో వున్న సమయంలో వచ్చిన ఆఫర్ అయిన ఈ సినిమా పోస్టర్‌ని డిలీట్ చేసి త్రిష తప్పు చేసిందంటున్నాయి నందమూరి అభిమానవర్గాలు.