గర్జించే సింహం... పిల్లిలా మ్యావ్.. మ్యావ్ అంటోంది.. పవన్‌పై వర్మ ట్వీట్స్

బుధవారం, 8 జులై 2015 (09:18 IST)
పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా నిర్మొహమాటంగా ప్రకటించారు. సింహంలా ఉండాల్సిన పవన్ పిల్లిలా మాట్లాడుతున్నాడని ట్వీట్ చేశారు. వరుసగా నాలుగు ట్వీట్స్ చేసి పవన్ ప్రెస్‌మీట్‌పై తీవ్రంగా వ్యతిరేకించారు. 
 
గర్జించే సింహం మేకలా మాట్లాడుతోంది..సారీ పిల్లిలా మాట్లాడుతోంది అని పవన్ ప్రసంగాన్ని ఉద్దేశించి అన్నారు. సింహంలాంటి పవన్కి నా విన్నపం ఒకటే పిల్లిలా ఉండకండి, అభిమానులు మీ నుంచి పులి గర్జనలు కోరుకుంటున్నారని తెలిపారు. మేకకి, మోక్కకితేడా తెలియని సింహం సింహం కాదు అని వర్మ అన్నారు.
 
ఇంకా ఏమన్నారంటే...సింహం అర్థం చేసుకోవాల్సింది సింహం సింహంలా ఉండాలి..తన గర్జనలో అంతరార్ధం కుక్కలకు వివరించకూడదు..సింహం జూలో ఉందనే భ్రమలో ఉన్నాయి. పవన్ ఎప్పుడూ బెస్ట్ గానే ఉండాలని ఆశిస్తున్నాను అని వర్మ ట్విట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి