ఆర్తి చావుకు కారణమేంటి..? అందుకే ఆమె మరణించిందా..!.. ఎందుకు?

సోమవారం, 8 జూన్ 2015 (16:20 IST)
ఆర్తి అగర్వాల్ మృతికి డాక్టర్ల నిర్లక్ష్యం కారణమని, ఆసుపత్రి చేతగాని తనమని ఇలా చాలా కారణాలే వినిపిస్తున్నాయి. అయితే ఆమె చావు వెనుక ఉన్న అసలు కారణమేంటి ? ఆమె ఒకే ఆపరేషన్ పదే పదే చేయించుకున్నారా..! అందుకే ఆమె మరణించారా... అసలు ఆమె ఎన్ని మార్లు ఆపరేషన్ చేయించుకున్నారు..? ఏం ఆపరేషన్ చేయించుకుంది ? వివరాలిలా ఉన్నాయి. 
 
ఆర్తి అగర్వాల్ మరణానికి ఆస్పత్రి వర్గాలే కారణమని కేసు వేయడానికి ఆమె సోదరి అదితి అగర్వాల్, ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మరణం వెనుక స్వయంకృపరాధమే కారణమన్న మాటలూ వినిపిస్తున్నాయి. ఆమె మరణానికి లైపోసక్షన్ సర్జరీనే కారణమని ఇప్పటికే రూఢీగా తెలుసు. సాధారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయి లావుగా తయారైన భాగాలకు ఈ చికిత్స చేస్తుంటారు. 
 
సాధారణంగా దానిని ఒక్కసారి చేయించుకోవడమే రిస్కని భావిస్తారు. దురదృష్టకర విషయం ఏంటంటే ఆమె పొట్టకు సంబంధించిన సర్జరీని మాత్రమే నాలుగోసారి చేయించుకోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఇటువంటి ప్రయత్నాలు చాలా అరుదుగా జరుగుతాయని తెలుస్తోంది. ఆర్తి తన సినిమా కెరీర్‌ని దృష్టిలో వుంచుకుని సన్నబడటానికి చేసిన  ప్రయత్నం బెడిసికొట్టింది. 
 
లావు తగ్గాలన్న ఒకే ఒక్క యావతోనే నాలుగుసార్లు సర్జరీ చేయిచుకునే సాహసానికి ఒడిగట్టిందని సమాచారం. వైద్య శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజ్లోల్లో అత్యాధునిక బేరియాట్రిక్ చికిత్సలు అందుబాటులోకొచ్చిన తర్వాత కూడా ఆర్తి ఇటువంటి పాత చికిత్సల వైపు మొగ్గు చూపడానికి ఆమె ఆర్థిక ఇబ్బందులే కారణమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి