చంద్రబాబు మళ్ళీ సిఎం అయ్యేందుకు 50 కోట్ల బేరం.. ఎవరితో?

శనివారం, 28 సెప్టెంబరు 2019 (18:35 IST)
దేశ రాజకీయాల్లో చంద్రబాబునాయుడుకు ఒక ప్రత్యేకత ఉంది. ఎత్తులకు పైఎత్తులు వేసి ప్రతిపక్ష పార్టీలను చిత్తుచేయడం చంద్రబాబుకు వెన్నెతో పెట్టిన విద్యగా విశ్లేషకులు భావిస్తుంటారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ సహాయంతో ఎపిలో అధికారాన్ని చేజిక్కించుకోగలిగాడన్నది అందరికీ తెలిసిన విషయమే.
 
అయితే ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాలను ఎపిలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అది ఇక్కడ సాధ్యం కాదని ఎద్దేవా కూడా చేశారు. కానీ వైసిపి భారీ విజయం సాధించడం.. ఆ తరువాత మొత్తం క్రెడిట్ అంతా ప్రశాంత్ కిషోర్‌కు వెళ్ళిపోయింది. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తినే సలహాదారుడిగా పెట్టుకోవాలని నిర్ణయించేసుకున్నారట చంద్రబాబునాయుడు.
 
దీంతో ప్రశాంత్ కిషోర్ శిష్యుడు రాబిన్ శర్మను లైన్లో పెట్టారట. చంద్రబాబు ఇప్పటికే రాబిన్ శర్మతో నేరుగా కూడా మాట్లాడారట. బేరం 50 కోట్లు. అక్టోబర్ మొదటి వారం నుంచి రానున్న ఎన్నికల వరకు రాజకీయ సలహాదారుడిగా తమ వెంట ఉంటూ పార్టీని గెలిపించే బాధ్యత తీసుకుంటే ఈ మొత్తం ఇస్తామని అతనితో బేరం పెట్టుకున్నారట.
 
గతంలో వైసిపి గెలుపుకు కూడా ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేశారు రాబిన్ శర్మ. అయితే తమ ప్రత్యర్థి పార్టీ వైసిపికి జనంలో ఉంటూ పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కాకుండా రాబిన్ శర్మను తీసుకోవాలని చంద్రబాబు ఒక నిర్ణయానికే వచ్చేశారట. 
 
ప్రస్తుతానికి అయితే సంప్రదింపులు మాత్రమే జరిపారట. కానీ రాబిన్ శర్మ మాత్రం ఒక నిర్ణయానికి రాలేదట. చంద్రబాబు నిర్ణయంపై మాత్రం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. ఎపిలో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం. ఆ పార్టీకి రాజకీయ సలహాదారులు ఎందుకని ప్రశ్నిస్తున్నారట. అయితే ఈసారి పార్టీ గెలుపొందాలంటే ఇలాంటి వ్యక్తులు అవసరమన్న అభిప్రాయంలో ఉన్నారట చంద్రబాబు. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్లకు చెప్పే ప్రయత్నం చేయబోతున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు