పవర్ స్టార్ పవన్ కల్యాణ్-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల మధ్య బంధం మరింత బలపడుతోంది. ఒకప్పుడు పవన్ కల్యాణ్, అల్లుఅర్జున్‌ల మధ్య వైరం వుందంటూ ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పూర్తిగా సీన్ మారిపోయింది.
శ్రీరెడ్డి వ్యాఖ్యల వివాదం దుమారం రేపడంతో పవన్ ఫిలిం ఛాంబర్ వద్ద చేపట్టిన నిరసనకి మద్దతు తెలుపుతూ బన్నీ అక్కడికి వచ్చారు. దీంతో పవన్, బన్నీల మధ్య ఎలాంటి వైరం లేదని తేలిపోయింది ఇటీవల బన్నీ కూడా రానున్న ఎన్నికల్లో పవన్ తరపున ప్రచారానికి సిద్ధమని ప్రకటించాడు.