బిడ్డను రక్షించిన సిబ్బందికి తొండంపైకెత్తి కృతజ్ఞతలు చెప్పిన ఏనుగు!! (వీడియో)

మంగళవారం, 12 నవంబరు 2019 (12:56 IST)
ప్రమాదంలో చిక్కుకున్న తన బిడ్డను రక్షించిన అటవీ సిబ్బందికి ఓ ఏనుగు తొండం పైకెత్తి కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను అటవీ శాఖ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ అటవీ ప్రాంతంలోని ఓ గున్న ఏనుగు ఓ గుంతలో పడిపోయింది.. దాన్ని బయటకు తీసేందుకు కొన్ని ఏనుగులు ప్రయత్నించగా, వాటి ప్రయత్నాలు ఫలించలేదు. 
 
ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. అటవీ సిబ్బందిని చూడగానే ఆ ఏనుగులు దూరంగా వెళ్లిపోయాయి. ఆ తర్వాత అటవీ సిబ్బంది ప్రొక్లెయిన్‌ సహాయంతో గున్న ఏనుగును ప్రమాదం నుంచి సురక్షితంగా రక్షించాయి. 
 
ఆ గున్న ఏనుగు బయటకు వచ్చిరాగానే తన తల్లివద్దకు చేరుకుంది. దీంతో అప్పటివరకు అక్కడే ఉన్న మిగిలిన ఏనుగులన్నీ తమదారిన తాము వెళ్లిపోయాయి. ఈ సమయంలో గున్న ఏనుగు తల్లి ఏనుగు కాసేపు ఆగి, అటవీ అధికారులు, సిబ్బంది వైపు తిరిగి తొండం పైకెత్తి కృతజ్ఞతలు తెలిపింది. ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

 

Best you will watch today. An #elephant calf fell into a ditch which was rescued. And see how mother stopped to thank the people. This is typical behaviour, elephants first try to rescue by their own, then leave space & stand far for getting help from Human. Via WA so quality. pic.twitter.com/rPx1EN9UIB

— Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 11, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు