యాంకర్ ప్రదీప్ 'పెళ్లి చూపులు'పై షాకింగ్... టీవీలు కట్టేస్తున్నారా?

సోమవారం, 1 అక్టోబరు 2018 (14:00 IST)
బిగ్ బాస్ తెలుగు 2 షో అలా ముగిసిందో లేదా అదే స్లాట్లో ప్రారంభమైన రియాల్టీ షో పెళ్లి చూపులు. ఇందులో స్పెషాలిటీ ఏమిటంటే... ముదురు బెండకాయ అని సెటైర్లు పడుతున్న యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకునేందుకు తగిన అమ్మాయిని ఎంపిక చేసుకోవడమే దీని ఉద్దేశ్యం. ఐతే... యాంకర్ ప్రదీప్ అన్నా... అతడి యాంకరింగ్ అన్నా చాలామంది చాలా చాలా ఇష్టంగా చూస్తారు. 
 
కానీ పెళ్లి చూపులు షోలో ప్రదీప్ ను ఇంకో కోణంలో(అదే పెళ్లి చేసుకునేందుకు సిగ్గుపడుతూ) చూడలేక చాలామంది తమ టీవీలను కట్టేశామని చెప్తున్నారు. తమ ఫేవరెట్ యాంకర్ ఇలా చేస్తున్నాడేమిటి అంటున్నారు. మరి మాచిరాజు ప్రదీప్ తన స్టయిల్‌ను కాస్త మార్చుకుంటే మంచిదేమో? ఏం చేస్తాడో చూద్దాం. 
 
కాగా ఇలాంటి షోలు ఇప్పటికే ఇతర భాషల్లో విజయవంతంగా నడిచాయి. హిందీ, తమిళం భాషల్లో బాగానే ఆకట్టుకున్నాయి. మరి తెలుగులో యాంకర్ ప్రదీప్ పెళ్లిచూపులు ఎలా నడుస్తుందో చూడాలి. ఇకపోతే ఆదివారం నాడు ప్రదీప్‌ను పెళ్లాడుతామంటూ తమ ప్రపోజల్స్ తెలిపిన అమ్మాయిలు 14 మంది.

వాళ్లెవరంటే... రీతు చౌదరి (వృత్తి జర్నలిజం), దీనా కృపా (దుబాయ్, ప్రదీప్ అమ్మ కోసం చీర తెచ్చింది), మౌనిక (కడప), డయానా (అనంతపురం), చంద్రకళ (బెంగుళూర్, అకాడమీ కౌన్సెలర్), దివ్య అశోకరావు డెకాటే, చలిమిశెట్టి దివ్య (మచిలీపట్నం), నెహా అజ్మల్ (మలేషియా, సాఫ్ట్వేర్ ఇంజనీరు), కోనేరు రమ్యక్రిష్ణ (విజయవాడ), అంబాల శ్రేయ (హైదరాబాద్), సాహితి (విజయవాడ), నవ్య సౌజన్య కనకాల, షేక్ షబీనా, జ్ఞానేశ్వరి కందిరేగుల. మరి ఈ 14 మంది అమ్మాయిల్లో ఇద్దరితో కొద్దిసేపు మాట్లాడాడు ప్రదీప్. మరి ఎన్ని వారాలకు ప్రదీప్‌కు తగిన అమ్మాయి వస్తుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు