గతంలో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కూడా అందమైన వరుడు కోసం స్వయంవరం పేరుతో ఓ షో నిర్వహించింది. కానీ, ఇపుడు నిర్వహించేది సంచలనంగా మారనుంది. ఇది పూర్తిగా స్వలింగ సంపర్కుల కోసం ఉద్దేశించింది. షోలో పాల్గొన్న వారి నుంచి సవ్యసాచి తనకు నచ్చిన వరుడిని ఎంచుకోనున్నాడు. ఈ విషయాన్ని సవ్యసాచి నిర్ధారించాడు. స్వయంవరం నిజమేనని, ఇందుకోసం ప్రొడక్షన్ హౌస్‌లు, టీవీ చానళ్లతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపాడు.