బిగ్ బాస్ సీజన్-2.. స్టోర్ రూమ్‌లో ఆ ఇద్దరు నిద్ర.. బాస్ వార్నింగ్

బుధవారం, 15 ఆగస్టు 2018 (16:14 IST)
బిగ్ బాస్ సీజన్-2 ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్లో తొమ్మిది వారాలు పూర్తయ్యాయి. మ‌రోనెల రోజుల‌లో బిగ్ బాస్ సీజ‌న్ 2 విజేత ఎవరో తెలియ‌నుంది. అయితే కొద్ది రోజులుల‌గా బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్‌లు ఇంటి స‌భ్యుల‌కి వ‌ణుకు పుట్టిస్తున్నాయి. ఇకపోతే.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన శ్యామల తనీష్‌పై మండిపడింది. ఫ్రెండ్‌గా , సోద‌రుడిగా త‌నీష్ క‌రెక్ట్ కాని, కెప్టెన్‌గా వేస్ట్ అని శ్యామ‌ల చెప్పుకొచ్చింది. 
 
ప్రస్తుతం బిగ్ బాస్ ల‌వ్ బ‌ర్డ్స్ త‌నీష్‌, దీప్తి సున‌య‌న‌లు స్టోర్ రూంలోకి వెళ్ళి ప‌డుకోవడం చర్చకు దారితీసింది. దీంతో కుక్క‌లు బిగ్గ‌ర‌గా అరిశాయి. ఇంటి స‌భ్యులు ఉలిక్కి ప‌డ్డారు. ఇంత‌లో స్టోర్ రూం నుండి బ‌య‌ట‌కి వ‌చ్చారు త‌నీష్‌, సున‌య‌న‌లు. అయితే బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చి ప‌ది వారాలు అవుతున్న‌ప్ప‌టికి ఇంటి నియమాల‌ని స‌రిగా పాటించ‌డం లేద‌ని బిగ్ బాస్ హెచ్చరించారు. 
 
ముఖ్యంగా కెప్టెన్‌గా ఉన్న త‌నీష్ స్టోర్ రూంలోకి వెళ్లి ప‌డుకోవ‌డం అస్స‌లు బాగోలేదు. ఈ క్ర‌మంలో తనీష్‌, దీప్తి సున‌య‌న‌కి శిక్ష విధించారు బిగ్ బాస్. త‌న నుండి ఆదేశం వ‌చ్చే వ‌ర‌కు ప‌గ‌లు, రాత్రి అనే తేడా లేకుండా ఇంటి స‌భ్యుల‌కి విస‌న‌క‌ర్ర‌ల‌తో ఊపుతూనే ఉండాల‌న్నారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన శిక్షను పక్కనపెట్టి.. హౌస్ మేట్స్‌కు విసరడం మానేసి వాళ్లకు వాళ్లే విసురుకుంటూ కనిపించారు తనీష్, సునయన.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు