చేతులతో మరుగుదొడ్డిని శుభ్రం చేసిన ఎంపీ!

శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (19:02 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ ఒకరు ఒట్టి చేతులతో పాఠశాల మరుగుదొడ్డిని శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ రాష్ట్రంలోని గణ జిల్లా చక్‌దేవ్‌పూర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను 5-6 తరగతులు చదువుతున్న బాలికలతో గత మంగళవారం శుభ్రం చేయించారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో కూడా రేవా జిల్లాలో కూడా ఇటీవల ఇలాంటి సంఘటన జరిగింది. 
 
ఈ నేపథ్యంలో రేవా బీజేపీ ఎంపీ జనార్థన్ మిశ్రా తాజాగా ఓవరాక్షన్ చేశారు. ఆ పార్టీ నిర్వహిస్తున్న సేవా పఖ్‌వాడ కార్యక్రమంలో భాగంగా, ఖత్‌ఖారీలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. 
 
అక్కడ మొక్కలు నాటిన తర్వాత అపరిశుభ్రంగా ఉన్న స్కూలు మరుగుదొడ్డిని ఒట్టి చేతులతో శుభ్రం చేశారు. అంతేకాకుండా, ఈ వీడియోను ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు ట్యాగ్ చేశారు.
 
మరోవైపు, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయితే, ఒట్టి చేతులతో స్కూల్ టాయిలెట్‌‍ను క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ జనార్థన్ మిశ్రాపై ఓవరాక్షన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదొక రాజకీయ స్టంట్ అని, స్కూలు పిల్లలతో టాయిలెట్ క్లీనింగ్‌ను కప్పిపుచ్చుకునేందుకే ఆయన ఇలా చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 


 

पार्टी द्वारा चलाये जा रहे सेवा पखवाड़ा के तहत युवा मोर्चा के द्वारा बालिका विद्यालय खटखरी में वृक्षारोपण कार्यक्रम के उपरांत विद्यालय के शौचालय की सफाई की।@narendramodi @JPNadda @blsanthosh @ChouhanShivraj @vdsharmabjp @HitanandSharma pic.twitter.com/138VDOT0n0

— Janardan Mishra (@Janardan_BJP) September 22, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు