ఊహించని వివాదంలో రాహుల్ గాంధీ.. కేజీఎఫ్-2 పాటలను అలా? (video)

శుక్రవారం, 4 నవంబరు 2022 (21:22 IST)
Rahul_Yash
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. భారత్ జోడో పాదయాత్రలో కేజీఎఫ్-2 పాటలను వినియోగిస్తున్నారంటూ రాహుల్ గాంధీతో పాటు తదితరులపై కేసు నమోదైంది. ఇందులో భాగంగా కేజీఎఫ్-2 పాటలపై హక్కులను కలిగివున్న బెంగళూరుకు చెందిన ఎమ్మార్టీ మ్యూజిక్ అనే మ్యూజిక్ ప్లాట్ ఫాం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేజీఎఫ్-2 హిందీ వెర్షన్ పాటలపై హక్కులను సొంతం చేసుకునేందుకు తాము భారీ మొత్తంలో చెల్లించామని, అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అనుమతిలేకుండా ఈ పాటలను వాడుకుంటున్నారని ఆరోపించింది. ఎమ్మార్టీ మ్యూజిక్ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
 
మరోవైపు రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగుతోంది. గురువారం రాత్రి పాదయాత్రను ముగించే సందర్భంగా జిల్లా పరిధిలోని ఆందోల్‌లో భారీ బహిరంగ సభ జరిగింది.
 
ఈ సభకు హాజరైన జనాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ ప్రసంగం ముగిసిన తర్వాత మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తన పక్కనే ఉన్న నేతలతో కలిసి చిందులేయడం మొదలెట్టారు. దామోదర స్టెప్పులను చూసిన సీనియర్ నేత వీహెచ్ కూడా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  

#BharatJodaYatra में,कल देर शाम,आंदोल वि. सभा, तेलंगाना में जनसभा का आयोजन किया गया।
श्री @RahulGandhi जी के भाषण के बाद माहौल इतना ख़ुशगवार था कि राज्य के पूर्व DY CM श्री @CilarapuDamodar पूर्व प्रदेश कांग्रेस अध्यक्ष श्री @vhrcongress जैसे वरिष्ठ नेता पूरी जनता के साथ झूम उठे। pic.twitter.com/mVrIUDyQgd

— Nadeem Javed (@nadeeminc) November 4, 2022

వెబ్దునియా పై చదవండి