కొండ మీద నుంచి కిందకు దూకుతున్న మేఘాలు.. ఎక్కడ..?

శుక్రవారం, 9 జులై 2021 (11:10 IST)
mizoram
ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయాంక సోషల్ మీడియాలో ముందుంటారు. తాజాగా, ఆయన తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసిన ఒక అద్భుతమైన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. దట్టమైన తెల్లని మేఘాలు కొండల మీద నుంచి ఒక దానిపై నుంచి ఒకటి నీరు ప్రవహిస్తున్నట్లుగా కదులుతున్న వీడియోను ఆయన షేర్​ చేశారు. 
 
అచ్చం జలపాతం లాగా మేఘాలు కిందకు కదిలే ఈ సుందరమైన దృశ్యం మనల్ని మంత్రముగ్థుల్ని చేస్తుంది. మిజోరం రాష్ట్రంలోని ఐజ్వాల్​లో కనిపించిన ఈ సుందరమైన దృశ్యాన్ని మొదటగా 'ది బెటర్ ఇండియా' తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. 
 
ఆ వీడియోను చూసి ఆకర్షితుడైన గోయెంకా వెంటనే రీట్వీట్ చేశారు. ''కొండ మీద నుంచి కిందకు దూకుతున్న మేఘాలు.. మిజోరాం రాజధాని ఐజ్వాల్​లో కనువిందు చేస్తున్నాయి. మేఘాలు తెలుపు వర్ణాన్ని సంతరించుకొని జలపాతాన్ని తలపిస్తున్నాయి. 
 
ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే మేఘాలు ఇలా మారుతాయి. కొండల నుంచి నీరు ప్రవహిస్తున్నట్లుగా మేఘాలు కదులుతున్నాయి. ఇది చూడటానికి మన రెండు కళ్లు చాలవు. ఇది చాలా అరుదైన సుందరమైన దృశ్యం.'అంటూ కామెంట్​ చేశాడు

Clouds cascade down the mountains at Aizawl in Mizoram, creating a mesmerizing 'cloud waterfall'!

This viral phenomenon requires very specific weather conditions to take shape, making it a rare sight to behold.

VC: Simon Jaeger (simon.jaeger.587 on Facebook) pic.twitter.com/VieStWaysA

— The Better India (@thebetterindia) July 3, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు